ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలి : సీపీ పి. సాయి చైతన్య

|| దృశ్యం న్యూస్ ||

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా జరగాలన్నారు, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

పోలీస్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ హాల్‌లో జరిగిన సమావేశంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చినట్లు సీపీ తెలిపారు. అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదలై, నవంబర్ 11 వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు.


కమీషనరేట్ కేంద్రంలో ఎలక్షన్ సెల్‌ను ఏర్పాటు చేశామని, అనుభవజ్ఞులైన అధికారులను కేటాయించినట్లు తెలుపుతూ, త్వరలో అంతర్ జిల్లా, అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు.
గత ఎన్నికల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, రౌడీషీటర్లు, నేరస్థులను బైండ్ ఓవర్ చేయాలని ఆదేశించారు. ఆధారాలు లేకుండా ₹50,000 కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఎన్నికల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తించాలని, అవసరమైతే శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని సీపీ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment