|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలోని అశోక్ సాగర్ చెరువులో ఆత్మహత్యలు మరింత విరివిగా జరుగుతున్నాయి,
ఈ పరిణామం వల్ల గ్రామస్తులలో తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది, నిజామాబాద్ నుండి బోధన్ మరియు బాసర్ వెళ్ళే ప్రధాన రహదారి పక్కన ఉన్న ఈ చెరువు ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించే బాధితులకు సులభ మార్గంగా మారింది.
ఈ సమస్య పై ఎమ్యెల్యేకు వినతి:
ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఆత్మహత్యలు చేసుకోవడం అనేది రోజురోజుకు పెరుగుతు ఓ ప్రధాన సమస్యగా మారి ఈ చెరువులో చేపలు పట్టే మత్స్యకారుల వద్ద ప్రజలు చేపలు కొనుగోలు చేయకపోవడంతో ఎన్నో నష్టాలు ఏర్పడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మత్స్యకారులు చేపల విడుదల కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
గ్రామస్తులు ఈ సమస్యపై స్పందిస్తూ, సంబంధిత అధికారులకు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరుతు చెరువులో జరిగే ఆత్మహత్యలు, అక్కడి మత్స్యకారుల ఆర్థిక స్థితిని కూడా ప్రభావితం చేస్తున్నాయని స్థానిక మత్స్యకారులు చెరువులో చేపలు పట్టడంలో ఆసక్తి చూపించడంలేదాని, ఈ పరిస్థితి వారి జీవనాధారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని గ్రామంలో ఈ పరిస్థితిని మార్చడానికి పగడ్బందీ ప్రణాళిక అవసరమని,
చాలామంది ఈ చెరువు వైపు వచ్చి తమ ప్రాణాలను తీసుకుంటున్నారు, ఈ విషయం గ్రామంలో ఒక నిరాశాత్మక వాతావరణాన్ని సృష్టిస్తోందాని తెలుపుతున్నారు.

సంబంధిత అధికారులకు మత్స్యకారులు మరియు గ్రామస్తులు మనవి చేస్తూ చెరువు చుట్టూ కంచె నిర్మాణం చేయాలని, అలాగే రహదారి వైపు చెరువులోకి అపరిచితులు ఎవరూ రాకుండా ఉండటానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈ కట్టుదిట్టమైన చర్యలు, ఆత్మహత్యలను తగ్గించడంలో సహాయపడతాయని కోరుకుంటున్నారు.
పోలీసుల తీరు కూడా మారాలి.
చెరువు కట్ట మధ్యలో నుండి బోధన్ మార్గంలో ఎడపల్లి పోలీస్ స్టేషన్ మరియు నిజామాబాద్ మార్గంలో ఆరవ పట్టణ పోలీస్ స్టేషన్ ల పరిధి ఉన్నది.
ఈ విషయంలో ఈ ఇరు పోలీస్ స్టేషన్ల సిబ్బంది సరిగ్గా చర్యలు తీసుకోవడం లేదని పోలీస్ సిబ్బంది చెరువు వైపు తక్కువగా దృష్టి పెడుతున్నారని, ఈ కారణంగా ఆత్మహత్యలు తగ్గడం లేదని ఇకనైనా పోలీస్ శాఖ ఉన్నత అధికారులు మరియు సంబంధిత అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి పరిష్కర మార్గం ఏర్పాటు చెయ్యాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.
అశోక్ సాగర్ ప్రాంతంలో జరుగుతున్న ఆత్మహత్యలు గ్రామస్తులకు భవిష్యత్తులో చాలా పెద్ద సమస్యగా మారనుంది, ఈ సమస్యపై సంబంధిత అధికారులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయమై దృష్టి పెట్టి, సామాజిక బాధ్యతగా భావించి అశోక్ సాగర్లో జరుగుతున్న ఆత్మహత్యల సమస్యను పరిష్కరించే విధంగా ఉండాలని కోరుతూ
మీ దృశ్యం న్యూస్.








