|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి గైని ప్రాంతంలో ఇరువురు యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దూషించుకున్నారు.
ఈ వివాదం కాస్తా రగిలి ఆందోళనకరంగా మారింది. అనంతరం ఓ యువకుడు మరొక్క యువకుడిపై కత్తితో దాడి చేయడంతో కత్తిపోట్ల కలకలం తలెత్తింది.
ఈ ఘటనపై ఎడపల్లి పోలీసులకు ఇరువురు యువకుల నుంచి ఫిర్యాదులు అందుకొని విచారణ ప్రారంబించినట్లు సమాచారం.
ఈ సంఘటన ఎడపల్లి లో తీవ్ర కలకలం సృష్టించడంతో సమీప గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.








