|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో CCS SI గోవింద్, SI మహేష్ సిబ్బందితో కలిసి పేకాట స్థావరాలపై మెరుపు దాడి చేశారు.

వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని మోస్రా గ్రామంలో జరిగిన ఈ దాడిలో 16 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొని 25,230/- నగదు, 15 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
రెండు వేర్వేరు దాడులలో 7 మంది, 9 మంది పేకాటరాయుళ్లపై కేసులు నమోదు చేసి వర్ని SHOకి అప్పగించారు. పోలీసులు పేకాట కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని హెచ్చరించారు.








