|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, సీసీఎస్ ఇన్‌చార్జ్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో జిల్లాలో అక్రమ కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ARP క్యాంప్‌లో నడుస్తున్న పేకాట స్థావరంపై సీసీఎస్ సిబ్బంది మెరుపుదాడులు నిర్వహించారు.
పోలీసుల దాడిలో ఇద్దరు పేకాటరాయుళ్లు పట్టుబడగా, ఘటనాస్థలం నుంచి నలుగురు నిందితులు పరారయ్యారు. దాడి సందర్భంగా 2 సెల్‌ఫోన్లు, రూ.30,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ప్రశాంతతను భంగం కలిగించేలా, చట్టాలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ పేకాట నిర్వహిస్తున్న వారిపై పోలీసులు ఎలాంటి ఉపేక్ష లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పట్టుబడిన నిందితులు, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఎడపల్లి పోలీస్ స్టేషన్ SHOకు అప్పగించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. జిల్లాలో పేకాట, జూదం, ఇతర అక్రమ కార్యకలాపాలపై నిజామాబాద్ పోలీసులు ఇలాగే ఉక్కుపాదం మోపనున్నట్లు హెచ్చరిక జారీ చేశారు.








