బఫర్ జోన్, FTL నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు – అధికారుల అవినీతిపై, స్థానికుల ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో బఫర్ జోన్ మరియు FTL చట్టాలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి. మూడు సంవత్సరాల క్రితం రథం చెరువు పరిధిలో భారీ పశువుల షెడ్డు నిర్మాణం జరగగా, సంబంధిత అధికారులు దీనిపై ఏ చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహం రేపుతోంది.

RTI ద్వారా సమాచారం కోరిన తర్వాత మాత్రమే ఈ నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేవని అధికారులు వెల్లడించగా, ఇది వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు. నీటి పారుదల శాఖ చట్టంలోని సెక్షన్ 17 కు విరుద్ధంగా ఈ నిర్మాణం చేపట్టడమే కాకుండా, చెరువులో పశువుల పేడ నిల్వ చేయడం వల్ల నీటి కాలుష్యం పెరిగింది.

నిబంధనలకు విరుద్ధంగా షెడ్డు నిర్మాణం ఉన్న బోరు బావి, విద్యుత్ సరఫరా కనెక్షన్లు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమేనని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఒక్కవైపు నిజాంసాగర్ ప్రధాన కాలువ, మరోవైపు చెరువు ఉన్న ప్రాంతంలో 30 మీటర్ల లోపల నిర్మాణం జరగడం నీటిపారుదల, సంబంధిత శాఖల అధికారుల అవినీతి, నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజలు విరుచుకుపడుతున్నారు.

అదేవిధంగా జానకంపేట్ గ్రామంలోని సంబదిత శాఖల ద్వారా వెంచర్లకు సరైన అనుమతులు లేకుండానే వాటి యాజమాన్యం కొనుగోలుదారులకు అమ్మకాలు చేపడుతున్న, మరియు ఇళ్ల నిర్మాణాలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలకు సరైన అనుమతులు లేకుండానే అవి కొనసాగింపుకు సహకరించడం ద్వారా అధికారులు అవినీతికి పాల్పడి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు బాటలు వేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఉన్నతాధికారులు ఈ అక్రమాలపై వెంటనే జోక్యం చేసుకొని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment