నవిపేట్ – మహిళ దారుణ హత్య – ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం మిట్టాపూర్ శివారులో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. సుమారు 30 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళ మృతదేహం తల, కుడిచేయి మణికట్టు వరకు లేకుండా కనిపించడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
సమాచారం అందుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఘటన స్థలాన్ని పరిశీలించారు.


ఈ సందర్భంగా డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లు సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. హత్య వెనుక గల మర్మాన్ని ఛేదించేందుకు కమిషనర్ హుటాహుటిన 10 ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి, ఈ దర్యాప్తు బృందాలు సాక్ష్యాలను సేకరించి నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగాయి.

ఈ కార్యక్రమంలో ఏసీపీ రాజా వెంకటరెడ్డి, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, నవిపేట్ ఎస్సై సిహెచ్. తిరుపతి పాల్గొన్నారు. పోలీసులు ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో తీసుకొని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment