|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాలకల్ రోడ్ లోని బుధవారం ఉదయం కల్లు కాంపౌండ్ ఎదురుగా ఉన్న స్మశానవాటికను అనుకోని ఉన్న డ్రైనేజీలో ఒక వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పట్టణ ఐదవ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలన నిర్వహించారు.

మృతుడు సీతారాం కాలనికి చెందిన కాంబ్లీ కపిల్ (35) గా గుర్తించారు. అతను దినసరి కూలి పనులతో జీవనం కొనసాగిస్తూ ఉంటాడని అని స్థానికులు తెలిపారు. మృతదేహం ఆ ప్రాంతంలో కనబడడంతో పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనపై, ఎస్.ఐ. గంగాధర్ కేసు నమోదు చేసి మరింత విచారణ చేపట్టారు.







