|| దృశ్యం న్యూస్ ||
బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాదాస్పద సంఘటన చోటుచేసుకుంది. న్యాయమూర్తులు రాజీ మార్గమే ఉత్తమ మార్గమని సూచిస్తుండగా, లోకాదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన పోలీసులే అత్యధిక జరిమానా వసూలు చేస్తుండటం కలకలం రేపింది.
సాలూరు మండలం మందర్నా ప్రాంతంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ పట్టుబడిన వ్యక్తులపై కేసు నమోదైంది. శనివారం బోధన్ న్యాయస్థానంలో నిర్వహించిన లోకాదాలత్‌లో న్యాయమూర్తి ప్రతి ఒక్కరికి రూ. 2000 జరిమానా విధించారు. అయితే కోర్టు కానిస్టేబుల్ మాత్రం బాధితుడికి జరిమానా కంటే ఎక్కువగా రూ. 4000 డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ విషయమై బాధితుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. కోర్టు నిర్ణయించిన జరిమానా కంటే అధికంగా డబ్బు వసూలు చేయడం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తు, పోలీసుల తీరుపై సంబంధిత ఉన్నత అధికారుల దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు.








