|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం స్వల్ప బండా తండాకు చెందిన భానోత్ శ్రీరామ్ నాయక్‌ను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం యువజన విభాగం జిల్లా కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నియామక పత్రాన్ని యువజన జిల్లా అధ్యక్షుడు మూడ్ ఇంధల్ నాయక్ చేతుల మీదుగా అందజేశారు. అలాగే జిల్లా సంయుక్త కార్యదర్శిగా బాదావత్ ప్రేమ్ దాస్ నాయక్ గండితాండ, ఇందల్వాయి మండలం ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా భానోత్ శ్రీరామ్ నాయక్ మాట్లాడుతూ, బంజారా సమాజ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని, రాష్ట్ర అధ్యక్షుడు రాములు నాయక్, జిల్లా అధ్యక్షుడు రామవత్ మోహన్ నాయక్ నాయకత్వంలో సమాజ సేవకు అంకితం అవుతానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రామవత్ మోహన్ నాయక్, డివిజన్ అధ్యక్షులు బాదావత్ శంకర్ నాయక్, కున్సోత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ రాజశేఖర్ నాయక్, యువజన ఉపాధ్యక్షుడు అనిల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.








