ధర్పల్లి: ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులచే ఈరోజు ట్రాఫిక్ నియమ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించే ప్రాధాన్యతపై వివరించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి పుష్పగుచ్చాలు అందించి, వారి భద్రత కోసం హెల్మెట్ ధరించాల్సిన అవసరం వివరించారు. రాత్రి సమయంలో ప్రమాదాల నివారణకు వాహనాల వెనుక భాగంలో రేడియం స్టిక్కర్లు అతికించారు.


ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయ బృందం కూడా చురుకుగా పాల్గొన్నారు. ట్రాఫిక్ భద్రతపై శ్రద్ధ పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి మంచి మార్గదర్శకాలు అవుతాయని స్థానికులు అభినందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment