|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీం, భరోసా ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ పై, మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మత్తు పదార్థాలకు బానిసల కాకుండా, సైబర్ క్రైమ్ లో సురక్షితంగా ఉండే విధానాలు, అమ్మాయిలపై అఘాత్యాల ప్రమాదాలు, మైనర్ డ్రైవింగ్, మరియు బాలికలను ఇబ్బంది పెడితే చట్టపరమైన చట్టపరమైన శిక్షల గురించి అవగాహన కల్పించారు.
ఎవరైనా మానసికంగా ఇబ్బందులు కలుగచేస్తే మొబైల్ నంబర్లు 8712657963 (షీ టీం) మరియు 8712657964 ( భరోసా ) ద్వారా బాలికలు తమ సమస్యలు తెలియచేయాలని సూచించారు.
షీ టీం కానిస్టేబుల్ స్వరూప, భరోసా సభ్యులు సౌందర్య లావణ్య, మరియు పాఠశాల ఉపాధ్యాయులు రాజేశ్వర్, రాధ, శారద, రమా, చల్లా లక్ష్మణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ అవగాహన కార్యక్రమం విద్యార్థులలో మానసిక శాంతి, సురక్షిత సంబంధాలపై అవగాహన పెంచే దిశగా ముందుకు తీసుకెళ్తుందని వారు భావిస్తున్నారు.








