మెదక్: విద్యార్థినిపై లైంగిక దాడి కేసులో అటెండర్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా రేగోడ్ మండలంలో చిన్నారి విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి కేసులో మెదక్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్న సారా జైపాల్ (25) 2019 జూన్‌లో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు బాధితురాలికి రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

ఈ కేసు POCSO చట్టం-2012 కింద విచారణకు వచ్చింది. మొత్తం ఐదుగురు సాక్షులను విచారించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. బాలయ్య సమర్థవంతంగా వాదించగా, భరోసా లీగల్ ఆఫీసర్ అడ్వకేట్ కె. శ్వేత బాధితురాలికి న్యాయ సహాయం అందించారు. పిల్లలపై లైంగిక దాడి అత్యంత ఘోర నేరమని, ఇటువంటి నేరస్తులపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment