|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో SBI బ్యాంక్ ఏటీఎంలో దొంగతనం యత్నం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున గుర్తు తెలియని దొంగలు గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై అలర్ట్ మెసేజ్ అందుకున్న మూడవ టౌన్ పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే నిందితులు ముందుగానే ఈకో వ్యాన్‌లో పారిపోయి, పాల్ద గ్రామ శివారులో వాహనాన్ని వదిలివేశారు.
ఈ సంఘటన స్థలాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, స్వయంగా సందర్శించారు. ఏటీఎం సెంటర్‌లో జరిగిన నేర విధానాన్ని సమీక్షించి, ఎస్సై హరిబాబు, సిఐ శ్రీనివాస్ రాజులకు నేరస్తులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు. అలాగే క్లూస్ టీమ్, సిసిఎస్ టీమ్ అధికారులకు కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు. పోలీసులు దొంగలపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు.








