|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ నగరంలోని జూన్ 2వ తేదీన 24వ డివిజన్ ప్రాంతంలో ఉదయం చెత్తను ట్రాక్టర్లో లోడ్ చేస్తుండగా, పారిశుధ్య కార్మికులు ఇమామ్ మరియు జవాన్ కుమార్‌లకు రెండు తులాల బంగారు గొలుసు కనిపించింది. ఈ గొలుసు విలువ సుమారు రూ.2 లక్షలు. గాయత్రి నగర్‌కు చెందిన పద్మ గౌడ్ అనే మహిళ అది తాను కోల్పోయిన గొలుసేనని నిర్ధారించగా కార్మికులు ఆ గొలుసును ఆమెకు క్షేమంగా అందజేశారు.
ఈ సంఘటనపై నగర పోలీస్ కమిషనర్ ఇమామ్, జవాన్ కుమార్ల నిజాయితీని అభినందిస్తూ సన్మానించారు. చెత్త సేకరణలో పని చేస్తున్న కార్మికులను నిర్లక్ష్యం చేయకుండా వారు చూపిస్తున్న మానవత్వం, బాధ్యతా భావాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని కమిషనర్ పేర్కొన్నారు. ఈ సంఘటన కార్మికుల నిజాయితీ సత్వానికి ప్రతీకగా నిలిచింది.








