కామారెడ్డి పోలీసుల మరో పెద్ద విజయం – అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల రాకెట్ ఛేదన.

|| దృశ్యం న్యూస్ ||

కామారెడ్డి జిల్లా పోలీసులు నకిలీ నోట్ల ముఠాపై ఉక్కుపాదం మోపుతూ మరో కీలక ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. ఇటీవల కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ నమోదు చేసిన కేసులో దర్యాప్తు విస్తరించిన పోలీసు బృందం చత్తీస్‌గడ్‌లో మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి ₹1,70,500 విలువైన నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌తో అంతర్రాష్ట్రంగా పనిచేసే ఫేక్ కరెన్సీ రాకెట్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ, “నేరస్తులు ఎట్టి పరిస్థితుల్లో చట్టం ముందు తప్పించుకోలేరు. నకిలీ నోట్ల తయారీ, రవాణా, పంపిణీపై కఠిన చర్యలు కొనసాగుతాయి” అని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment