|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా TGSPDCL డివిజన్‌కి చెందిన డివిజనల్ ఇంజనీర్ షేక్ చాంద్ షరీఫ్ బాషా రూ.21,000/- లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు. ఫిర్యాదుదారునికి చెందిన పౌల్ట్రీ ఫారమ్‌కి ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడానికి సంబంధించిన దస్తావేజును ప్రాసెస్ చేయడం కోసం లంచం డిమాండ్ చేసినట్లు అనిశా అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినట్లయితే, వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేయవచ్చు. అదేవిధంగా వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని అవినీతి నిరోధక శాఖ స్పష్టం చేసింది.








