|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తానాకలన్ గ్రామానికి చెందిన మెట్టు శ్రీనివాస్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై జానకంపేట్ నుంచి తానాకలన్ గ్రామానికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం అతడిని బలంగా ఢీకొట్టింది. ఈ దెబ్బకు తీవ్ర గాయాలపాలైన శ్రీనివాస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ప్రమాద సమాచారం అందుకున్న ఎడపల్లి పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. ప్రమాదానికి గల కారణాలు గుర్తుతెలియని వాహనం వివరాలు తెలుసుకునే దిశగా పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఈ రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.








