|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం, ఒడ్డేపల్లి గ్రామం గుండా ప్రవహిస్తున్న నీటిలో గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైన ఘటన కలకలం రేపింది. ఒడ్డేపల్లి గ్రామ కార్యదర్శి మధుమాసుల రమేష్ ఈ విషయాన్ని ఎడపల్లి పోలీస్ స్టేషన్‌కు తెలియజేశారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం, ఈ మృతదేహం దాదాపు నెల రోజులుగా నీటిలో ఉండి పూర్తిగా కుళ్లిపోయింది. ఇది నిజాంసాగర్ D46 కెనాల్ ద్వారా కొట్టుకు వచ్చి ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. పరివాహక ప్రాంతాల్లో ఎవరైనా తమ కుటుంబ సభ్యులను కనిపించకుండా పోయారని అనుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటనపై మరింత సమాచారం కోసం స్థానిక పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మీ పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా సంబంధించిన ఆధారాలు ఉంటే ఎడపల్లి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించగలరని ఎస్ఐ వంశీ కృష్ణ రెడ్డి తెలిపారు.








