|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని మోస్రా గ్రామ శివారులో శుక్రవారం అర్ధరాత్రి విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ గుర్తుతెలియని వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో సుమారు 40 సంవత్సరాల వయస్సు గల ఆ వ్యక్తికి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై మోస్రా గ్రామానికి చెందిన భూపాల్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వర్ని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్‌ను గుర్తించే దిశగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మృతుడు ఎవరో ఇప్పటివరకు గుర్తించలేకపోయామని తెలిపారు. కింద తెలిపిన వ్యక్తి వివరాలు ఎవరైనా గుర్తిస్తే వెంటనే వర్ని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలను కోరారు.








