|| దృశ్యం న్యూస్ ||
మత్తు పదార్థాలు మరియు మాదకద్రవ్యాలు సమాజానికి పెద్ద సవాలుగా మారడంతో వాటి నియంత్రణ కోసం వివిధ శాఖల అధికారులు కలిసికట్టుగా పని చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు.
నిజామాబాద్ జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో మత్తు పదార్థాలు వినియోగం, రవాణా మరియు ఇతర అంశాలపై చర్చించి వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై గట్టి నిఘా పెడుతూ వాటి నియంత్రణ కోసం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రత్యేకంగా రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా మత్తు పదార్థాలు రవాణా అవుతున్నందున ఆర్టీసీ, రైల్వే అధికారులు కఠినమైన చర్యలు చేపట్టాలని అన్నారు.
గంజాయి వంటి మత్తు పదార్థాలను ఏ ప్రాంతాల నుండి రవాణా అవుతున్నాయి, అవి ఎక్కడ ఉత్పత్తి అవుతున్నాయి అనే వివరాలను గుర్తించి, మూలాలను అడ్డుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్, ఎక్సయిజ్, రవాణా, వ్యవసాయ, అటవీ, వాణిజ్య పన్నులు మరియు ఔషధ నియంత్రణ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.








