అప్పుల బాదతో ఉరివేసుకొని మృతి చెందిన యువకుడు.

||దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోర గ్రామానికి చెందిన వ్యక్తి అప్పుల బాదతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కమ్మరి సతీష్ (40) అనే వ్యక్తి సోమవారం రాత్రి 11 గంటల సమయంలో తన ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందాడు.

సతీష్ మద్యానికి బానిసై, తీవ్ర ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిసింది. జీవితంపై విరక్తితో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సతీష్ భార్య ఫిర్యాదు మేరకు, వర్ని ఎస్‌ఐ మహేష్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment