వికలాంగుడి వద్ద సినీఫక్కీ తరహాలో నగదు దోచుకెళ్లిన ఓ దుండగుడు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఓ వికలాంగుడు 4000 రూపాయలను మోసపోయిన సంఘటన చోటు చేసుకుంది.
బాధితుడు గుండారం నడిపి సాయిలు స్థానిక పోస్ట్ ఆఫీస్ లో ఫించన్ డబ్బులు తీసుకోవడానికి వెళ్లి అక్కడ ఓ దుండగుడు మాటలకు మోసపోయి వికలాంగ ఫించన్ 4000 రూపాయలు కాకుండా అదనంగా 12000 రూపాయలు ఇప్పిస్తాను అని చెప్పి బాధితుడిని అతని వెంట మండల తహసిల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడే వుండే చెట్టు కింద కూర్చోబెట్టి అధిక డబ్బులు రావాలంటే కొందరికి డబ్బులు ఇవ్వాలంటూ తహశీల్ధార్ కార్యాలయం సమీపంలోనే వుండే కెనరా బ్యాంక్ విత్‌డ్రా ఫామ్ పై సంతకం తీసుకొని 4000 రూపాయలకు చిల్లర తీసుకుని వస్తా అని చెప్పి డబ్బులు తీసుకొని పారిపోయాడు, దాంతో బాధితుడు వెంటనే స్థానికులను పిలిచి, ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటనపై ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మోసానికి పాల్పడిన వ్యక్తి త్వరలో అదుపులోకి తీసుకొని బాధితునికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment