|| దృశ్యం న్యూస్ ||
ఔరద్ మండలం బీదర్ జిల్లాకు చెందిన మడివాడ్ సంజీవ్ కుమార్ (45) టైలరింగ్ పని చేస్తూ వృత్తి కోసం తన భార్య మరియు పిల్లలను వదిలి, నిజామాబాద్ జిల్లా చందుర్ మండల కేంద్రంలోని గత నెల రోజులుగా హన్మండ్లు ట్రైలర్ వద్ద పనిచేస్తూ అక్కడే ఓ గది అద్దెకు తీసుకుని గడుపుతున్నాడు, మద్యం అలవాటుకు బానిసైన సంజీవ్ సోమవారం పని ముగిసిన తరువాత, అతను అద్దెకు ఉంటున్న గదిలో మద్యం సేవించి, ఒంటరితనం భరించలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడైంది.
ఈ సంఘటనపై అతని తమ్ముడు విజయ్ కుమార్ పిర్యాదు చేయగా, వర్ని మండల పోలీస్ స్టేషన్ ఎస్సై కృష్ణ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.








