|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం గోన్ గొప్పుల గ్రామంలో సోమవారం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. మద్యం వ్యసనానికి బానిసైన గంగోని రమ్య అనే తల్లి, మద్యం మత్తులో ఐదు నెలల చిన్నారిని గొంతు నులిమి హత్య చేసినట్లు సమాచారం. భర్త మల్లేష్ అను వ్యక్తి ఆమె వ్యసనాన్ని తప్పుబట్టగా తరచూ గొడవలు జరుగుతున్నాయని, గొడవలకు చిన్నారియే కారణమని భావించిన రమ్య ఈ దారుణానికి ఒడిగట్టింది.
పసికందును నేను చంపలేదని మొదట భూకాయించిన తల్లిపై భర్త అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్సై సందీప్ విచారణ కొనసాగిస్తున్నారు. తల్లి చేతుల మీదే పసికందు హత్య జరగడం స్థానికుల హృదయాలను కలిచివేసింది.







