|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని గురుకుల పాఠశాల సమీపంలో మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు, టివిఎస్ మోపెడ్ పై వెళుతున్న పల్లికొండ సాయిలు (45) ను ఢీకొనడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఉదయం సమయంలో చోటుచేసుకుంది మోపెడ్ పై ప్రయాణిస్తున్న సాయిలు పెట్రోల్ బంక్ నుండి రోడ్డు పైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది అని స్థానికులు తెలిపారు.
ప్రమాదం తర్వాత స్థానికులు వెంటనే స్పందించి, గాయాలపాలైన సాయిలును నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు.
సాయిలు తలకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
ఈ ఘటన స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.








