|| దృశ్యం న్యూస్ ||
నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నవిపెట్ మండలం ఫకీరాబాద్ గ్రామానికి చెందిన 40 ఏళ్ల సంతోష్ గౌడ్ అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ ఉదయం నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు నవిపేట్ మండల పోలీస్ అధికారులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, సతీష్ గౌడ్ గతంలో కూడా నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడని, అప్పటికే స్థానికులు అతన్ని కాపాడారని తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఇతర కారణలు ఏవైనా ఉన్నయా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.
సమాజంలో ఆర్థిక సంక్షోభాలు, మానసిక ఒత్తిళ్లు ఇలా చిన్నా పెద్దా ఎన్నో కారణాల వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఇలాంటి ఘటనలను కట్టడి చేసే విధంగా అవగాహన కార్యక్రమాలు ఉదృతం చెయ్యాలని గ్రామస్థులు కోరుతున్నారు.








