షాట్ సర్కిట్ వల్ల ఇంటి అగ్నికి ఆహుతి – భారీ ఆస్తి నష్టం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో శనివారం సాయంత్రం షాట్ సర్కిట్ కారణంగా ఒక ఇంటిలో మంటలు చెలరేగి ఆస్తి నష్టం చోటుచేసుకుంది. న్యాకపు లక్ష్మి అనే మహిళ ఇంట్లో శనివారం సాయంత్రం ఈ అగ్ని ప్రమాదం జరిగింది. షాట్ సర్కిట్ వల్ల పెంకుటిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో నుండి బయటకు పొగలు రాగానే స్థానికులు, యువకులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అర్పే ప్రయత్నం చేశారు. కానీ మంటలు పెరిగిపోవడంతో ప్రక్కన ఉన్న న్యాకపు గంగాధర్ ఇంటికి కూడా మంటలు అంటుకొనే ప్రమాదం ఉందని భావించి గంగాధర్ ఇంట్లోని వస్తువులను బయటకు తీసుకువచ్చారు.

మంటలు అదుపులోకి రాకపోవడంతో స్థానికులు ఫైర్ ఇంజిన్ కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో గంగాధర్ ఇంటి కొంత భాగం పాక్షికంగా దెబ్బతింది. ఈ అగ్నిప్రమాదంలో లక్ష్మి ఇంటిలో ఉన్న అన్ని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి, బాధితులు తమకు ప్రభుత్వ నుండి సహాయం అందించాలని కోరుతు వారి ఆవేదన వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment