|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం, జానకంపేట్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారు ప్రాంతంలోని మస్జిద్ సమీపంలో ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నిజాం సాగర్ కాలువలో పడి మృతి చెందాడు.

ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపిన వివరాల ప్రకారం, బాలుడు అసిఫ్ (5) s/o అఫ్జల్ శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి వద్ద నుంచి బయటకు వెళ్లి ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా కాలువలో జారిపడ్డాడు.
బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే కాలువ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు నిజాంసాగర్ నీటి కాలువలో ప్రవహిస్తున్న నీటిని తాత్కాలికంగా నిలిపివేసి శోధన కొనసాగించారు.
అనంతరం శనివారం ఉదయం జగ్గారావు ఫారం సమీపంలో బాలుని మృతదేహం లభ్యమైంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దిగ్భ్రాంతికర సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.








