గాలిపటం కోసం ప్రాణాలు కోల్పోయిన 13 ఏళ్ల బాలుడు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.
13 ఏళ్ల బాలుడు షేక్ మతిన్ హై వోల్టేజ్ విద్యుత్ తీగల సమీపంలో ఉన్న చెట్టుకు వేలాడుతున్న గాలిపటం కోసం చెట్టు పైకి ఎక్కి ఆ గాలిపటం తీసే. ప్రయత్నంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

 

షేక్ మతిన్ కుర్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి విద్యార్థిగా చదువుతున్నాడు. సోమవారం ఉదయం ఈ దురదృష్టకర ఘటన చోటు చేసుకున్నది. బాలుడి మరణంతో తల్లి సాయిదా బేగం తీవ్ర దుఃఖానికి గురయ్యారు, తన కుమారుడు తనను ఒంటరిగా చేసి వెళ్లాడని కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ సంఘటనతో కుర్నపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకుంది. విద్యుత్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం, చెట్లకు అనుచితంగా ఉన్న హై వోల్టేజ్ తీగలు తొలగించకపోవడం వలన ఈ ప్రమాదం చోటుచేసుకుంది అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సంఘటన ద్వారా విద్యుత్ భద్రత మరియు జాగ్రత్తలు పెంచాల్సిన అవసరం మరింత స్పష్టమైంది.

ఈ ఘటనపై ఎడపల్లి మండల పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment