|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామ శివారులోని శివాలయం వద్ద ఉన్న చెరువు గట్టకు ఉదయం కాలక్రత్యాల కోసం వెళ్లిన అశ్విత్ అనే బాలుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో అశ్విత్ మోకాలి భాగంలో తీవ్రంగా గాయపడి, ఎలుగుబంటి దాడి నుండి తప్పించుకొని ప్రాణాలను కాపాడుకున్నాడు.
గాయపడిన బాలుడిని స్థానికులు వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన స్థలాన్ని అటవీశాఖ అధికారులు పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఎలుగుబంటి దాడితో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలు ఎదుర్కొంటున్నారు, ఈ నేపథ్యంలో గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ, ఈ సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులతో సంప్రదించి తగు చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు తెలిపారు.








