|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని ARP క్యాంప్ గ్రామ శివారులో ఉన్న D46 కెనాల్లో గుర్తు తెలియని బాలిక మృతదేహం లభ్యమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గురువారం మధ్యాహ్నం కెనాల్ నీటితో కొట్టుకొని వస్తున్న బాలిక మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై, మృతదేహాన్ని బయటకు తీసి ఎడపల్లి మండల పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక విచారణలో మృత బాలిక వయస్సు సుమారు 10 సంవత్సరాల లోపే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు బాలికకు సంబంధించిన గుర్తింపు లభించలేదని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలికకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే ఎడపల్లి పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు.
📞 ఎడపల్లి పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్: 8712659873
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు.








