బోధన్: బీసీ సంఘాల జేఏసీ కార్యాచరణ ప్రారంభం – రాష్ట్ర బంద్ విజయవంతం చేయాలని పిలుపు.

|| దృశ్యం న్యూస్ ||

బోధన్ నియోజకవర్గంలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న జరగనున్న బీసీ రాష్ట్ర బంద్ విజయవంతం చేయడానికి కార్యాచరణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ప్రతి టిఫిన్ సెంటర్, వ్యాపార స్థావరాలను సందర్శించి బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. టిఫిన్ సెంటర్ యాజమాన్యాలు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించి బీసీ హక్కుల సాధనలో భాగమవుతామని తెలిపారు.
జేఏసీ నాయకులు రవీందర్ యాదవ్, సుధాకర్ చారి, అబ్బాగోని గంగాధర్ గౌడ్, సంతోష్, నాగుల రవిశంకర్ గౌడ్, అశోక్ చారి, సంజు పటేల్, నర్సింగ్, అప్ప. లక్ష్మణ్ పటేల్, పవన్ కుమార్, శేఖర్, హన్మండ్లు చారి తదితరులు పాల్గొన్నారు.

బీసీ సంఘాలు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు వస్తున్న వేళ, ఈ బంద్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిని ఆకర్షించాలని జేఏసీ నేతలు తెలిపారు. బీసీ ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం కోసం ఈ బంద్ చారిత్రాత్మకమవుతుందని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment