|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, బోధన్ రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే మహమ్మాద్ షకీల్ ఆమేర్
ఈ రోజు సాయంత్రం తన స్వగృహానికి విచ్చేసారు. గత కొన్ని రోజులుగా బోధన్ లో ప్రత్యక్షంగా కనిపించని షకీల్ ఆమేర్ ఈ రోజు పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతలతో వ్యక్తిగతంగా సమావేశమయ్యారు.
రేపు ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు షకీల్ ఆమేర్ అందుబాటులో ఉంటారు అని, బోధన్ లో నివసిస్తున్న ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తమ నాయకుడిని కలవాలని కోరుకునేవారు వారి స్వగృహానికి రావచ్చు అని ఓ ప్రకటన ద్వారా ప్రముఖ బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.
షకీల్ అమెర్ రాకతో స్థానిక రాజకీయాల్లో, బీఆర్ఎస్ నాయకులలో, కార్యకర్తలలో కొత్త ఉత్సాహం నెలకొంటుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.








