|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ నగర పాలక సంస్థలో సమాచార హక్కు చట్టం (RTI Act) వారోత్సవాల భాగంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ అదనపు కమిషనర్ రవీందర్ అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో అన్ని విభాగాధిపతులు మరియు సెక్షన్ క్లర్కులు పాల్గొని సమాచార హక్కు చట్టం ప్రాముఖ్యత, దాని అమలు విధానాలపై వివరమైన చర్చ జరిగింది.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ — పౌరులు ప్రభుత్వ పనితీరు పట్ల అవగాహన పెంచుకోవడానికి, పారదర్శకతను సాధించడానికి RTI చట్టం ఎంతో కీలకమని, అధికారులు సమయానికి ప్రజలకు సమాచారం అందించాలి అని సూచించారు.
అదేవిధంగా RTI దరఖాస్తుల సమయపూర్వక పరిష్కారం, రికార్డుల సక్రమ నిర్వహణ, ఆన్లైన్ దరఖాస్తుల ప్రాసెస్ వంటి అంశాలపై మార్గదర్శకాలు ఇచ్చారు.








