ఆవులకు మత్తు మందు ఇచ్చి దొంగిలిస్తున్న ముఠా అరెస్టు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ కమిషనరేట్‌ పరిధిలో ఆవులకు మత్తు మందు ఇంజక్షన్లు ఇస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు CCS ఇన్స్పెక్టర్ సురేష్ నేతృత్వంలో సిబ్బంది యాదగిరి, సుభాష్, నీలేష్, నరేష్‌లు రెండు రోజులపాటు నాందేడ్‌లో గాలించి ఆరుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు ఇన్నోవా కారును ఉపయోగించి దొంగ నెంబర్ ప్లేట్లు, ప్రెస్ మరియు పోలీస్ బోర్డులతో ఫేక్ గుర్తింపుతో కారులోని సీట్లు తొలగించి ఆవులను అక్రమంగా తరలిస్తున్నారు అని పోలీసులు తెలిపారు.

అనంతరం వాహనాన్ని సీజ్ చేసి నిందితులను దేగ్లూర్ పోలీసులకు అప్పగించారు. ఈ దాడి ద్వారా ఆవు దొంగతనాలకు చెక్ పెట్టినట్లు నిజామాబాద్ పోలీసులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment