|| దృశ్యం న్యూస్ ||
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లిలో గల్ఫ్ ఏజెంట్ డికొండ ప్రసాద్ ఇంటి ముందు బుధవారం ఉదయం వన్నెల్దేవి రాజేష్ ( 60 ) మృతదేహంతో అతని కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు.
రాజేష్ పూర్వంలో టీవీ9 రిపోర్టర్ గా పనిచేసిన వక్త.
రాజేష్ తన కొడుకు సృజన్ కోసం గల్ఫ్ ఏజెంట్ డికొండ ప్రసాద్ కి 5 లక్షల రూపాయలు చెల్లించి యూరప్ పంపించాలని కోరాడు. అయితే, ఏజెంట్ ప్రస్తావించిన యూరప్ కాకుండా సృజన్‌ను కజికిస్తాన్‌కు పంపించాడు. అక్కడ సృజన్‌కు పని దొరకకపోవడంతో 15 రోజుల క్రితం స్వదేశానికి తిరిగి రావడంతో ఏజెంట్ ను తిరిగి ఆ డబ్బులు అడిగినప్పుడు ఏజెంట్ ప్రసాద్ అతడికి డబ్బులు ఇవ్వనని చెప్పడంతో నిరుత్సాహానికి గురైన రాజేష్, బుధవారం ఉదయం మరోసారి ఏజెంట్ ప్రసాద్ ఇంటికి వెళ్లినపుడు అతడికి డబ్బులు ఇవ్వడానికి ఇంకా మొండికేశాడాని, ఈ కారణంగా రాజేష్ తీవ్రంగా మనస్థాపం చెంది ఇంటికి వెళ్లిన అనంతరం గుండెపోటు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. కానీ చికిత్స పొందుతూ రాజేష్ మరణించారు.
వారి కుటుంబం మృతదేహంతో ఏజెంట్ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేసింది, సమాచారాన్ని అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, ఏజెంట్ ప్రసాద్ స్థానికంగా లేకపోవడంతో అతనితో ఫోన్ ద్వారా మాట్లాడి ఆర్ముర్ కి వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం మృతదేహాన్ని రాజేష్ స్వగ్రామం తొర్లికొండకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇలాంటి గల్ఫ్ ఏజెంట్ల ద్వారా మోసపోయి ప్రాణాలు కోల్పోతున్న వారి విషయంలో బాధితులు న్యాయం కోసం ఎందరో పోరాటం చేస్తున్నారు, రాజేష్ మృతి ఈ సమస్యపై మరింత ప్రాధాన్యం కలిగిస్తోంది, ఇలాంటి మోసాలు జరగకుండా ప్రభుత్వం సమగ్రంగా చర్యలు చేపట్టి అదుపులో పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.








