|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా బోధన్ లో రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బుధవారం పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి, ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసారు. ఈ దాడిలో 4.30 కిలోల ఆల్ఫా జోలం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఎక్సైజ్ రాష్ట్ర టాస్క్ ఫోర్స్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు తెలిపిన ప్రకారం, బాన్సువాడ – బోధన్ రహదారిపై వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో 4.30 కిలోల ఆల్ఫాజోలంను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. ఈ నిందితులు సిద్దిపేట జిల్లాకు చెందిన నర్సింలు గౌడ్, నవీన్ గౌడ్ మరియు నాందేడ్ జిల్లా అహ్మద్ పురకు చెందిన యాదగిరి గౌడ్‌గా గుర్తించబడ్డారు. వీరు మహారాష్ట్ర నుండి ఆ మత్తు పదార్థాన్ని తరలిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ దాడి లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డిఎస్పీ శ్రీనివాస్ రావు, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, నిజామాబాద్ జిల్లా సూపరింటెండెంట్ స్వప్న, స్థానిక ఎక్సైజ్ సీఐ పవన్ గౌడ్ ఇతర సిబ్బంది సహకరించారు నిందితులను రిమాండ్ కు తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.








