బాలికపై లైంగిక దాడి కేసు: నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1 లక్ష జరిమానా.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా, తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన గణిత ఉపాధ్యాయుడికి మెదక్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధించింది. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు వెల్లడించారు. 2023 డిసెంబర్‌లో నమోదైన ఈ కేసులో అప్పటి తూప్రాన్ ఎస్ఐ శివానందం కేసు నమోదు చేయగా, తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి బలమైన సాక్ష్యాధారాలతో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
కేసు విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య సమర్థవంతంగా వాదనలు వినిపించగా, భరోసా లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ శ్వేత బాధిత బాలికకు న్యాయ సహాయం, మానసిక ధైర్యం అందించారు.

ఈ కేసులో సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి ఆర్.ఎం. సుభావళి నిందితుడు కోకిల కోమల్ అనురూప అనలంకర్‌కు శిక్ష విధించారు. కోర్టు విధించిన జరిమానా మొత్తాన్ని బాధిత బాలికకు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.
ఈ కేసులో కృషి చేసిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందిస్తూ, మహిళలు, చిన్నారుల భద్రతకు పోలీస్ శాఖ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment