పోక్సో కేసులో 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష – ఏడేళ్ల బాలికకు న్యాయం.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా శంకరంపేట్ (ఎ) మండలంలో ఏడేళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడి కేసులో నిందితుడు థలారి మోహన్‌కు కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5000 జరిమానా విధించింది. ఈ తీర్పు చిన్నారికి న్యాయం చేయడమే కాకుండా సమాజానికి బలమైన సందేశాన్ని ఇచ్చింది.

ఈ కేసులో పోక్సో ప్రత్యేక ప్రజా అభియోజకులు బాలయ్య, భరోసా సెంటర్ లీగల్ అడ్వైజర్ స్వేత అహర్నిశలు కృషి చేసి చిన్నారికి ధైర్యం చెప్పారు. బాలిక కోర్టుకు మొదట భయపడినా, మహిళా అడ్వైజర్ స్వేత సాయం‌తో ‘వల్నరబుల్ విట్నెస్ డిపోజిషన్ సెంటర్’లో భద్రతా వాతావరణంలో వాంగ్మూలం ఇచ్చేలా జడ్జి నీలీమ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.

దర్యాప్తు అధికారులు సమగ్ర ఆధారాలు సేకరించగా, కోర్టు వారిని ప్రత్యేకంగా అభినందించింది. చిన్నారి శారీరక, మానసిక బాధలకు రూ.3,00,000 పరిహారం చెల్లించాలన్న నిర్ణయం తీసుకుంది.

జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు శిక్ష సాధనలో కృషి చేసిన సిబ్బందిని అభినందించారు. ఇలాంటి తీర్పులు భవిష్యత్తులో నేరాలను అరికట్టడంలో కీలకమని అధికారులు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment