రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన CRPs కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సహాయం.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా చెగుంట మండలంలో సమగ్ర శిక్షా CRPs గా విధులు నిర్వర్తిస్తున్న రమేష్ నాయక్ & శ్రీనివాస్‌లు 14-02-2025న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

ఈ విషాదకరమైన ఘటన తెలుసుకున్న సమగ్ర శిక్షా ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు వివిధ మండలాల్లోని సహోద్యోగులు ఐక్యమత్యంతో ముందుకు వచ్చి రూ.12,00,000/- (పన్నెండు లక్షల రూపాయలు) సేకరించారు.

ఈ సేకరించిన నిధులను రమేష్ & శ్రీనివాస్ పిల్లల భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ద్వారా జమ చేశారు. అలాగే కొంత నగదు మరియు కిరాణా సరుకులను వారి కుటుంబ సభ్యులకు అందించారు.

సాధారణంగా ప్రభుత్వమే బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలి. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం రాకపోవడంతో ఉద్యోగులే ముందుకు వచ్చి సహాయం చేశారు..

ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధాకిషన్, జిల్లా కోఆర్డినేటర్లు జ్యోతి & సుదర్శన్ మూర్తి, చేగుంట MEO నీరజ, తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుండిగల్ యాదగిరి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శేషాద్రి, మెదక్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్, కోశాధికారి బొజ్జ సంపత్ మరియు తదితరులు CRPs, MIS ఉద్యోగులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment