నిజామాబాద్‌కు నేడు సీఎం రేవంత్ రెడ్డి రాక – రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కుటుంబానికి పరామర్శ.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా కేంద్రంనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రానున్నారు, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాతృమూర్తి ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన నేపథ్యంలో, ద్వాదశ దినకర్మ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకుని భూపతి రెడ్డిని స్వయంగా పరామర్శించనున్నారు.

ఎమ్మెల్యే తల్లి మృతికి గల కారణాలను తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతారని జిల్లా అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో పేర్కొంది.
సీఎం పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ పట్టణంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసి, ముఖ్య ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఉదయం 11గంటల నుండి సీఎం తిరిగి వెళ్లే వరకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు. సీఎం రాక కారణంగా జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేపట్టింది.

Join WhatsApp

Join Now

Leave a Comment