కొనుగోలు కేంద్రాల నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం – రెంజల్ వ్యవసాయ అధికారికి షోకాజ్ నోటీసు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెంజల్ మండల వ్యవసాయ అధికారి విధుల్లో అలసత్వం వహించారని పేర్కొంటూ, వ్యవసాయ అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు.

కలెక్టర్ ఈరోజు నవీపేట మరియు రెంజల్ మండలాల్లోని అభంగపట్నం, తడ్‌గాం, వీరన్నగుట్ట కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం సరఫరాలో లోపాలు, ట్యాబ్ ఎంట్రీల్లో జాప్యం, ట్రక్ షీట్ లు ఆలస్యంగా తెప్పించడం వంటి నిర్లక్ష్యాలను గమనించారు.
తుపాను ప్రభావంతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన కలెక్టర్, తేమ శాతం 17% లోపు ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు.

రైతుల బిల్లులు, బోనస్ చెల్లింపులు సకాలంలో జరగాలని, టార్ఫాలిన్ షీట్లు, ఆరబెట్టే ప్రదేశాలు సిద్దంగా ఉంచాలని ఆదేశించారు. రైతుల ప్రయోజనాల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment