మండల విద్యాధికారి ఎస్. నీలకంఠం పాఠశాలల ఆకస్మిక తనిఖీ.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ మండల విద్యాధికారి ఎస్. నీలకంఠం ఈరోజు మండలంలోని పలు పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. యుపిఎస్ శివాయిపల్లి, ఎంపీపీ ఎస్ వెంకటాపూర్, ఎంపీపీఎస్ వెంకటాపూర్ తండా, ఎంపీపీఎస్ కోటూరు, పాఠశాలలకు వెళ్లి పాఠశాలల్లో అమలవుతున్న పరీక్షా విధానాలను సమీక్షించారు.

విద్యాధికారి F1, FA2, SA1, FA3, FA4, మిడ్‌లైన్ పరీక్షా పత్రాలను పరిశీలించి, మూల్యాంకన విధానం పట్ల ఉపాధ్యాయులకు సూచనలు అందించారు. అలాగే ఎల్ఐపి (LIP) ప్రణాళిక ప్రకారం అమలవుతున్న పుస్తకాల స్థితిని పరిశీలించి అవసరమైన మార్పులను సూచించారు.

స్కూల్ సీసీ రికార్డులను పరిశీలించి, పూర్తి చేయాల్సిన అంశాలను ఉపాధ్యాయులకు వివరించి, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, పౌష్టికాహారం నాణ్యతను మెరుగుపరిచేందుకు సూచనలు ఇచ్చారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ, వంటశాలను పరిశీలించి పరిశుభ్రత పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని సీసీహెచ్ లకు సూచించారు.

పాఠశాల గ్రాండ్స్, స్పోర్ట్స్ గ్రాండ్స్, ఈకో క్లబ్ గ్రాండ్స్ వంటి అన్ని విభాగాలను వెంటనే డ్రా చేయించి, ఏఏపీసీ తీర్మానం ప్రకారం మార్చి 31లోపు సరైన విధంగా నిధులను వినియోగించాలని ఆదేశించారు.

ముఖ్యంగా విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను మెరుగుపరిచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, ప్రస్తుత ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment