|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుంపల్లి మహేందర్ తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ల అభివృద్ధి, కృషిని తక్కువగా అంచనా వేయడానికి అరవింద్ కి హక్కు లేదని, వారి గురించి మాట్లాడేటప్పుడు అరవింద్ అర్హత చూసుకొని మాట్లాడాలని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఉద్యమ నాయకుడు అని, భూపతి రెడ్డి ఉద్యమాలు చేసిన సమయంలో ఎంపీ అరవింద్ రాజకీయాల్లో కూడా లేడు అని పేర్కొన్నారు.
అంతేకాకుండా, అరవింద్ కుటుంబానికి రాజకీయ గుర్తింపు రావడానికి కాంగ్రెస్ పార్టీయే కారణం అని గుర్తు చేశారు.
ఎంపీ అరవింద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి తమ స్వప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేయడం కొత్తేమీ కాదు అని మండిపడ్డారు. వీలైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి జిల్లాలో అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆకాష్, రూరల్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఇర్ఫాన్, ప్రధాన కార్యదర్శి భూపతి తదితరులు పాల్గొన్నారు.








