|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో “మీ డబ్బు – మీ హక్కు” కార్యక్రమం కింద DEAF (నిష్క్రియ ఖాతాలు) అవగాహన సమావేశంను నిర్వహించారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ అంకిత్ కౌర్, అధ్యక్షత వహించారు. సమావేశంలో RBI AGM రాములు, యూనియన్ బ్యాంక్ DGM అరుణ, LDM సునీల్, అలాగే బ్యాంకులు, CFL కౌన్సిలర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా RBI AGM రాములు మాట్లాడుతూ, డీఈఏఎఫ్ ఖాతాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని, నిష్క్రియ ఖాతాల్లో ఉన్న డబ్బును ఖాతాదారులు లేదా నామినీలకు తిరిగి పొందే ప్రక్రియను సులభంగా వివరించాలని సూచించారు.
బోధన్ CFL కౌన్సిలర్లు రాజ్‌కుమార్ మరియు అస్రా బేగం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ విజయాలను వివరించారు. బోధన్ ప్రాంతంలో SBI మరియు యూనియన్ బ్యాంక్‌కు చెందిన 25 DEAF ఖాతాల ద్వారా ₹3,30,000 విలువైన క్లెయిమ్‌లను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో సహకరించిన SBI మేనేజర్ రాథోడ్ ప్రదీప్ మరియు UBI మేనేజర్ మనోజ్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశం DEAF ఖాతాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కీలకంగా నిలిచింది.








