మెదక్ సీసీఎస్ ఇన్స్పెక్టర్‌గా యం.కృష్ణమూర్తి బాధ్యతలు స్వీకరణ.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లాలో సీసీఎస్ (CCS) ఇన్స్పెక్టర్‌గా యం.కృష్ణమూర్తి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాస్ రావును మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కృష్ణమూర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ, కొత్త బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

జిల్లా ఎస్పీ టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ బాధ్యతలను కూడా సీసీఎస్ ఇన్స్పెక్టర్ యం.కృష్ణమూర్తికి అప్పగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. పేకాట, గాంబ్లింగ్, మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలను కఠినంగా అణచివేయాలని స్పష్టం చేశారు.

మెదక్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ యం.కృష్ణమూర్తి కొత్త బాధ్యతలతో నేర నియంత్రణలో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment