నిజామాబాద్‌: భారీ వర్షంలో తడిసి ముద్దవుతున్న కార్మికులు, రెయిన్ కోట్‌లో డిప్యూటీ కమిషనర్ పై విమర్శలు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ నగరంలో గురువారం ఉదయం కురిసిన భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిస్థితిని పరిశీలించేందుకు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నగరంలోని పలు ప్రాంతాల్లో సందర్శించారు. ఈ సందర్భంగా వర్షంలో తడుస్తున్న కార్మికులు పనులు చేస్తుండగా, కమిషనర్ మాత్రం రైన్ కోట్ ధరించి ఓ సిబ్బందితో గొడుగు పట్టించుకోవడం పట్ల ప్రజల నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

 

వర్షపు నీటిలో మునిగిన కాలనీల్లో డ్రెయినేజ్ క్లీనింగ్, వరదనీరు తొలగింపు వంటి పనులు మున్సిపల్ కార్మికులు చేయగా, వారు ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా తడుస్తూ పని చేయడం గమనార్హం. చలిలో వణుకుతున్న కార్మికులు కనీస సదుపాయాల కోసం బాధపడుతుండగా, అధికారులు మాత్రం పరిరక్షణతో వారితో పనులు చేయించడంలో మాత్రమే నిమగ్నమయ్యారు.

ప్రజలు ఈ అంశంపై మండిపడుతున్నారు. ఎండ, వాన, చలి తేడా లేకుండా శ్రమించే కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించడం మున్సిపల్ శాఖ బాధ్యత అని తీవ్ర అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ప్రజల ఆరోగ్యం, భద్రత పట్ల ముందుండే మున్సిపల్ కార్మికులు ఎంతటి విపత్కర పరిస్థితులలో అయిన పని చేసే వారి శారీరక, మానసికంగా రక్షించాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులదే అని, కార్మికుల ఆరోగ్యం, భద్రత పట్ల ఉన్నత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment