మెదక్ జిల్లా: వెంకటేశ్వర హచరిస్ లో ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని వెంకటేశ్వర హచరిస్ లో ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో ఒక కార్మికుడు మరణించాడు.
ఈ మృతుడు బీహార్ రాష్ట్రానికి చెందిన అభిమన్యుగా గుర్తించబడ్డాడు, ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం, మృతుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించాలని స్థానిక కార్మికులు న్యాయం కోరుతూ ఆందోళన చేపట్టారు.

కంపెనీ యజమాన్యం మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు.
పోలీసులు మరియు సంబంధిత అధికారులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు.

Join WhatsApp

Join Now

Leave a Comment