|| దృశ్యం న్యూస్ ||
మెదక్ స్థానిక గ్రంథాలయంలో జరుగుతున్న 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఆరవ రోజు సందర్భంగా, ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

భారత తొలి మహిళా ప్రధానిగా నిలిచిన ఇందిరా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు.
తరువాత గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పాత నాణేల సేకరణ ప్రదర్శన (coin collection exhibition) తిలకించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ, మహిళల విజయాలను గుర్తించడం, సమానత్వం పై అవగాహన పెంపొందించడం మహిళా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
గ్రంథాలయ వారోత్సవాల్లో మహిళా దినోత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహించడం ద్వారా గ్రంథాలయాల్లో మహిళల పాత్ర, పుస్తక పఠనంపై వారి పాల్గొనడం మరింత పెరుగుతుందని తెలిపారు. యువత, విద్యార్థులు గ్రంథాలయాలను విస్తృతంగా ఉపయోగించి ఉన్నత లక్ష్యాలు సాధించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీ ఓ రమాదేవి, గ్రంథాలయ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి, కార్యదర్శి వంశీకృష్ణ, సిబ్బంది జె. యాదగిరి తదితరులు పాల్గొన్నారు.








